బేసన్ వోట్స్ చిల్లా
పదార్థాలు:
శెనగపిండి: 20 గ్రాములు
ఓట్స్ పిండి: 20 గ్రాములు
ఉల్లిపాయ: 10 గ్రాములు
టమోటా: 10 గ్రాములు
కొత్తిమీర - 5-6 ఆకులు
పచ్చిమిరపకాయలు - 1/2
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగినంత
కారం - చిటికెడు
జీలకర్ర పొడి - చిటికెడు
ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
పోషక విలువలు:
శక్తి: 210 కిలో కేలరీలు
ప్రోటీన్: 8.2 గ్రాము
విధానం:
- నూనె మినహా అన్ని పదార్థాలను కలపి పల్చని పిండి చేయడానికి నీరు జోడించండి, ఉండలు కట్టకుండా కలపండి.
- వేడి మధ్యస్థంగా ఉన్న తవా/పాన్ మీద నూనె బ్రష్ చేసి పిండిని పోయాలి.
- చీలా చేయడానికి పిండిని మెల్లగా పరుచుకునేలా కదపండి.
- తక్కువ నుండి మీడియం మంట మీద పైన ఉడకడం ప్రారంభమయ్యే వరకు చిల్లాను ఉడికించాలి.
- బేస్ లేత బంగారు రంగు వచ్చేవరకు ఉడికించాలి.అప్పుడు మరొవైపుకు తిప్పండి.బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా ఉడికించాలి.
- 2TSBP పెరుగు లేదా 2TSP మింట్ పచ్చడితో వోట్స్ చిల్లాను సర్వ్ చేయండి.