అధిక రక్తపోటు, సమర్థవంతంగా నియంత్రించబడకపోతే, రోగుల జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఇవిగో ఆరు మార్గాలు:
సరైన ఆహారం తీసుకోండి
- అధిక సోడియం (ఉప్పు) కలిగి ఉన్న ఆహారం ఒక వ్యక్తి శరీరంలో నీరు నిలవడానికి మరియు అధిక రక్తపోటుకి దారితీయవచ్చు.
- పొటాషియం అధికంగా ఉండే ఆహారాలలో అరటిపండ్లు, కాల్చిన బంగాళాదుంపలు, అవకాడోలు మరియు ఉడికించిన తెల్ల చిక్కుళ్ళు వంటివి తినాలి.
మద్యం పరిమితులను ఏర్పాటు చేసుకోండి మరియు పొగాకును నిలిపివేయండి.
- అధిక మొత్తంలో మద్యం తీసుకోవడం వల్ల గుండె దెబ్బతింటుంది.
- మహిళలు రోజుకు ఒక డ్రింక్ మరియు పురుషులు రోజుకు రెండు డ్రింక్స్ కి తమను తాము పరిమితం చేసుకోవాలి.
- మీ పొగాకు వాడకాన్ని నిలిపివేయడం కూడా సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించండి
- ఒత్తిడితో కూడిన పరిస్థితి కూడా కొద్దిపాటి వ్యవధి కొరకు రక్తపోటును పెంచుతుంది.
- ధ్యానం లేదా నడక ఒత్తిడిని ఎదుర్కోవటానికి మీకు సహాయపడతాయి.
నిర్దేశించిన విధంగా మందులు తీసుకోండి.
- మీరు వాటి నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా చూడడానికి మందులు తీసుకోవడం కోసం అందించిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించండి.
చురుకుగా ఉండండి
- ఎక్కువ చురుగ్గా ఉండే వ్యక్తులు తక్కువ హృదయ స్పందన రేటును కలిగి ఉంటారు.
- గుండె సంకోచించిన ప్రతిసారీ తక్కువగా పని చేస్తుంది, ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
- పెద్దలు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం ఉండాలి.
సహజమైన సప్లిమెంటుని తీసుకోండి.
- చాలా కాలం నిల్వచేసిన వెల్లుల్లి సారం, చేప నూనె, మందార, వెయ్ ప్రొటీన్ మొదలైన కొన్ని సహజ సప్లిమెంట్‌లు కూడా బిపిని తగ్గించడంలో సహాయపడవచ్చు.
సూచనలు:
- Stress and High Blood Pressure: What’s the Connection?” Mayo Clinic, 18 Mar. 2021, mayoclinic.org/diseases-conditions/high-blood-pressure/in-depth/stress-and high-blood-pressure/art-20044190.
- Robinson, Lawrence. “Blood Pressure and Your Brain – HelpGuide.org.” Https://Www.helpguide.org, Mar. 2020, www.helpguide.org/articles/healthy-living/blood-pressure-and-your-brain.htm.