Humrahi

గుండె వైఫల్యం యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం

మీ పరిస్థితి యొక్క రకం మరియు తీవ్రతను బట్టి గుండె వైఫల్యం లక్షణాలు మారుతూ ఉంటాయి. మీకు తీవ్రమైన శారీరక శ్రమ ఉంటే తప్ప, తేలికపాటి గుండె వైఫల్యం గుర్తించబడదు. మీకు ఎడమ వైపు లేదా కుడి వైపు గుండె వైఫల్యం ఉందా అనే దానిపై ఆధారపడి మీ లక్షణాలు మారవచ్చు. అయితే, రెండు రకాల లక్షణాలు సంభవించవచ్చు. మీ గుండె బలహీనంగా అయ్యే కొద్ది, లక్షణాలు తరచుగా మరింత ఎక్కువగా ఉంటాయి. గుండె వైఫల్యం తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన పరిణామాలకు దారితీస్తుంది.

ముందస్తు హెచ్చరిక సంకేతాలు/లక్షణాలు::

  • మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనుల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం అనేది మీరు అనుభూతి చెందే మొదటి సంకేతాలలో ఒకటి.
  • గుండె బలహీనంగా మారినప్పుడు, మీరు దుస్తులు ధరించేటప్పుడు లేదా గదిలో తిరిగేటప్పుడు మరియు వెల్లికిలా పడుకున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని గమనించవచ్చు.
  • ఎడమ వైపు గుండె వైఫల్యం: మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా విపరీతమైన అలసట, సాధారణ బలహీనత, వేళ్ళు మరియు పెదవుల నీలిరంగులోకి మారడం, నిద్రలేమి మరియు ఏకాగ్రతలో ఇబ్బంది, వెల్లికిలా పడుకున్నప్పుడు నిద్రపట్టకపోవడం ఉండవచ్చు
  • కుడి వైపు గుండె వైఫల్యం: వికారం, ఆకలి లేకపోవడం, పొట్ట ప్రాంతంలో నొప్పి, మీ చీలమండలు, పాదాలు, కాళ్లు, పొట్ట మరియు మెడలోని సిరల్లో వాపు, తరచుగా మూత్రవిసర్జన మరియు బరువు పెరగడం.

మీరు పైన పేర్కొన్న వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంకేతాలు/లక్షణాలను కలిగి ఉంటే, వాటి గురించి మీ ఆరోగ్య సంరక్షణ బృందానికి తెలియజేయండి మరియు మీకు ఏవైనా గుండె సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ కానప్పటికీ, మీ గుండె యొక్క పరీక్ష చేయమని అడగండి.

ప్రస్తావన:

  1. National Heart, Lung and Blood institute. https://www.nhlbi.nih.gov/health/heart-failure.
  2. American Heart Association. Heart attack and stroke symptoms. https://www.heart.org/en/health-topics/heart-failure/warning-signs-of-heart-failure.

 

 

.