ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటుగా స్థిరమైన మందుల వాడకం సరైన కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉండడానికి మరియు ఆరోగ్యకరమైన గుండెని కలిగి ఉండడానికి మీకు సహాయపడుతుంది.
మీ కొలెస్ట్రాల్ మందులకు కట్టుబడి ఉండటానికి పాటించదగిన చిట్కాలు:
- మందులకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యత: కొలెస్ట్రాల్ ఔషధాల యొక్క ప్రయోజనాలు మరియు వాటికి కట్టుబడి ఉండకపోవడం వలన మీ ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి మీకు మీరే అవగాహన చేసుకోండి.s
- ఒక దినచర్యను ఏర్పాటు చేసుకోండి: మీ మందులు తీసుకోవడాన్ని మీ దినచర్యలో చేర్చుకోండి మరియు మీకు సూచించడానికి మందుల రిమైండర్ యాప్స్ లేదా అలారములను ఉపయోగించండి.
- మీ మందులను ఒక క్రమంలో పెట్టుకోండి: మోతాదును మిస్ కాకుండా ఉండటానికి మీ మందులను పిల్‌బాక్స్ లేదా వీక్లీ పిల్ ఆర్గనైజర్‌లో పెట్టుకోండి
- మద్దతు వ్యవస్థను చేర్చుకోండి: మీ మందుల షెడ్యూల్ గురించి మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు లేదా విశ్వసనీయ సంరక్షకులకి తెలియజేయండి.
- ప్రిస్క్రిప్షన్‌లను ముందుగానే రీఫిల్ చేసుకోండి: మీ ప్రిస్క్రిప్షన్‌లను ముందుగానే రీఫిల్ చెఉస్కొవదమ్ ద్వారా లేదా రీఫిల్ తేదీల కోసం రిమైండర్‌లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ కొలెస్ట్రాల్ మందులు ఖాళీ అయిపోయి ఉండడాన్ని నివారించండి.
- అవగాహాన కలిగి ఉండండి:ఏవైనా మార్పుల గురించి అవగాహన కలిగి ఉండడం ద్వారా మీ మందుల నియమావళిని ఎప్పటికప్పుడు తాజాగా ఉంచుకోండి .
- డాక్టర్ సందర్శనలు:పురోగతి గురించి చర్చించడానికి మరియు అవసరమైన సర్దుబాట్లు చేయడానికి మీ వైద్యుడిని కలుస్తూ ఉండండి.
ప్రస్తావన:
- (2020, September 3). Types of cholesterol-lowering medicine. Centers for Disease Control and Prevention. https://www.cdc.gov/cholesterol/treating_cholesterol.htm#:~:text=Statin%20drugs%20lower%20LDL%20cholesterol
- Center for Drug Evaluation and Research. (2016, February 16). Why You Need to Take Your Medications as Prescribed or Instructed. U.S. Food and Drug Administration. https://www.fda.gov/drugs/special-features/why-you-need-take-your-medications-prescribed-or-instructed