Humrahi

గుండెపోటు తర్వాత కొలెస్ట్రాల్‌ నిర్వహణ–ఎందుకు కీలకం?

గుండెపోటు ఎదుర్కోవడం అనేది చాలామంది వ్యక్తులకు వారి జీవితాన్నే మార్చే ఒక మేల్కొలుపు లాంటిది

 

ఇది ఎందుకంత కీలకం?

  • అధిక కొలెస్ట్రాల్ అనేది ధమనుల్లో కొవ్వు పేరుకోవడానికి దారితీస్తుంది
  • అంతిమంగా అది గుండెపోటు ప్రమాదం పెంచుతుంది
  • కొలెస్ట్రాల్ స్థాయిలు నిర్వహించడం ద్వారా, భవిష్యత్తులో రాగల గుండె సంబంధిత సంఘటనలు నివారించవచ్చు1

 

కొలెస్ట్రాల్ నిర్వహణ కోసం ఆచరణీయ చిట్కాలు

 

  • గుండెకి-మేలుచేసే ఆహారం తినండి:

ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లేత ప్రొటీన్లు, గింజలు, గింజలు మరియు ఆలివ్ నూనె చేర్చుకోండి. ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలు మరియు పూర్తి-స్థాయి కొవ్వుతో ఉండే పాల ఉత్పత్తులు పరిమితంగా తీసుకోండి.

 

  • క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొనాలి

చురుకైన నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా మీ హృదయ స్పందన రేటు పెంచే ఏరోబిక్ వ్యాయామం లాంటి క్రమబద్ధమైన వ్యాయాయం చేయండి.

 

  • ఔషధాలు క్రమం తప్పకుండా తీసుకోవడం:

ఔషధాలు సిఫార్సు చేస్తే, సూచించి విధంగా వాటిని తీసుకోండి మరియు వైద్య సలహా లేకుండా వాటిని నిలిపి వేయకండి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో స్టాటిన్స్ లాంటి ఔషధాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి2.2.

 

  • ధూమపానం మానేయండి మరియు మద్యం తీసుకోవడం పరిమితం చేయండి:

ధూమపానం మానేయడానికి మరియు మద్యపానం పరిమితం చేయడానికి మద్దతు కోరండి. ఇవి అధికంగా తీసుకోవడమనేది కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచుతుంది.

 

సూచనలు:

  1. Gencer B, Giugliano RP. Management of LDL-cholesterol after an acute coronary syndrome: Key comparisons of the American and European clinical guidelines to the attention of the healthcare providers. Clin Cardiol. 2020;43(7):684-690.
  2. Million Hearts. https://millionhearts.hhs.gov/about-million-hearts/optimizing-care/cholesterol-management.html. Accessed 26June 2023