ఉప్పు మరియు అధిక సోడియం కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి
- వంట చేసేటప్పుడు, ఉప్పును ఎక్కువగా ఉపయోగించకుండా చూసుకోండి.
- బదులుగా, మీ వంటకాలకి రుచి జోడించడానికి మూలికలు మరియు మసాలా దినుసులను ఉపయోగించండి.
- ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ మరియు స్పోర్ట్స్ డ్రింక్స్ నుండి దూరంగా ఉండండి.
- ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని నివారించండి ఎందుకంటే తరచుగా వాటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
నియంత్రిత శ్వాస
- సౌకర్యవంతంగా వెల్లికిలా పడుకోండి.
- మీ చేతులను మీ ఛాతీపై మరియు పక్కటెముక క్రింద పెట్టండి.
- మెల్లగా మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, మరియు పొట్ట పైకి ఉబ్బడాన్ని అనుభూతి చెందండి
- పొత్తి కడుపు కండరాలను బిగబట్టి, 5 లెక్కపెడుతూ మెల్లగా శ్వాస వదలండి.
- సాధారణంగా మరియు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 10 సార్లు ఇదే విధంగా చేయండి.
నడకను ఆస్వాదించండి
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు లేదా వారంలో ఎక్కువ రోజులు వ్యాయామం చేయండి.
- అప్పుడే ప్రారంభించినవారికి, మెల్లగా నడవడం లేదా ఈత మంచి ఎంపికలు.
- ఏదైనా వ్యాయామ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు, ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
మీ ఆహారానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని జోడించండి
- మీరు జోడించాల్సిన ఆహారాలలో చిలగడదుంపలు, టమోటోలు, రాజ్మా, నారింజ రసం, అరటిపండ్లు, బఠానీ, బంగాళదుంపలు, గింజలు, పుచ్చకాయ మరియు కర్బూజా ఉన్నాయి.
సంగీతం వినండి
- రోజుకు కనీసం 30 నిమిషాలు, 2 లేదా 3 సార్లు సరైన రకం సంగీతం వినండి
- సాహిత్యం లేదా పెద్ద శబ్దం చేసే వాయిద్యాలు లేకుండా, తక్కువ-టెంపో మరియు తక్కువ-పిచ్ కలిగిన సంగీతం, ప్రజల మనస్సుకి ప్రశాంతతను అందిస్తుంది.
మీ బరువును గమనించుకుంటూ ఉండండి
- సరైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గర్భధారణ సమయంలో మీ బరువు పెరుగుదలను సరిగా నిర్వహించడానికి మార్గాలు
- అధిక బరువుతో ఉండడం కారణంగా వెన్నునొప్పి, అలసట మరియు కాళ్ళ తిమ్మిరి వంటి అదనపు గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
సూచనలు:
- “High Blood Pressure during Pregnancy.” Centers for Disease Control and Prevention, 2019, www.cdc.gov/bloodpressure/pregnancy.htm.
- Kattah, Andrea G., and Vesna D. Garovic. “The Management of Hypertension in Pregnancy.” Advances in Chronic Kidney Disease, vol. 20, no. 3, May 2013, pp. 229–239, https://doi.org/10.1053/j.ackd.2013.01.014.