Humrahi

గుండె వైఫల్యం రోగులకు కుటుంబం మరియు సంరక్షకులు ఏవిధంగా మద్దతు అందిస్తారు

గుండె వైఫల్యం నిర్వహణ అంత సులభమేమీ కాదు. గుండె వైఫల్యానికి గురైన రోగులు శారీరకంగా, గతంలో లాగా పనులు చేయలేరు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు, ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం ఔషధాలు తీసుకోవడం, శరీరం మీద మరింత శ్రద్ధ వహించడం మరియు ఒత్తిడి లేకుండా చూసుకోవడం మీద దృష్టి పెట్టడాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలి. జీవిత భాగస్వాములు, కుటుంబాలు, స్నేహితులు లేదా పొరుగువారి నుండి సంరక్షణా సహాయం అనేది గుండె వైఫల్యం రోగులు వారి దీర్ఘకాలిక అనారోగ్యం నిర్వహించడంలో సహాయపడుతుంది.

గుండె వైఫల్యం రోగులకు సహాయం అందించడం కోసం కొన్ని చిట్కాలు::

  • గుండె-ఆరోగ్యం సంరక్షించే ఆహారం తయారీ, సేకరణ మరియు వండుకోవడం లాంటి రోజువారీ పనుల్లో సహాయం అందించడం; సరైన కేలరీలు తీసుకునేలా ప్రోత్సహించడం; అసాధారణ రీతిలో బరువు తగ్గడం మీ నిఘా ఉంచడం
  • స్పర్శ, వినడం, శ్రద్ధ, హాస్యం, ద్వారా వారికి సహాయం అందించడం
  • నడక, సమతౌల్యతా వ్యాయామాలు మరియు పరిస్థితి తీవ్రత ఆధారంగా తగిన ఇతర కార్యకలాపాలు ప్రోత్సహించడం.
  • సూచించిన ఔషధాలు తీసుకోవడం, ప్రతివారం తీసుకోవాల్సిన మాత్రల నిర్వహణ మరియు రీఫిళ్ల నిర్వహణ మరియు రిమైండర్లు రీఆర్డర్ చేయడం కోసం ఫార్మసీని సందర్శించడం.
  • ధూమపానం మరియు మద్యపానం విరమణ కోసం మద్దతు అందించడం మరియు ప్రోత్సహించడం.
  • చికిత్స ప్రణాళిక గురించి వైద్య సిబ్బందితో చర్చించడం మరియు రోగి కోసం మాట్లాడడం.
  • ఆసుపత్రి నుండి డిశ్చార్జి తర్వాత చికిత్స కోసం ప్రణాళిక చేయడం మరియు సంరక్షణ కొనసాగింపు నిర్ధారించడం.
  • మెడికల్ అపాయింట్‌మెంట్లు క్రమం తప్పకుండా ఉండేలా టైమ్ టేబుల్ నిర్వహించడం.

 

ప్రస్తావన:

  1. Kitko L, McIlvennan CK, Bidwell JT, et al. Family Caregiving for Individuals With Heart Failure: A Scientific Statement From the American Heart Association. Circulation. 2020;141(22):e864-e878.

ఇటీవలి పోస్ట్‌లు