ఇంట్లోనే రక్తపోటు చెక్ చేసుకోవడం కోసం క్రింది పద్ధతులు అనుసరించండి:
- రక్తపోటు చూసుకునే ముందు మీరు ప్రశాంతంగా ఉన్నారని నిర్ధారించుకోండి.
- మీ చేతిని టేబుల్ లాంటి ఒక చదునైన ప్రదేశం మీద ఉంచండి. మీ అరచేయి పైకి చూస్తున్న స్థితిలో మీ చేయి ఉన్నట్టుగా నిర్థారించుకోండి.
- బీపీ మానిటర్ కఫ్‌ని మీ భుజం చుట్టూ చుట్టండి మరియు అది ఉబ్బడం కోసం బెలూన్‌ని పిసకండి.
- అనరాయిడ్ మానిటర్ విలువలు ఉపయోగించి, మీ సాధారణ రక్తపోటు కంటే 20-30ఎంఎంహెచ్‌జి( mm Hg) ఎక్కువ స్థాయికి వెళ్లే వరకు కఫ్ ఉబ్బేలా చేయండి.
- మీ సాధారణ రక్తపోటు ఎంతో మీకు తెలియకపోతే, కఫ్‌ను ఏ స్థాయి వరకు ఉబ్బించాలనే విషయమై మీ వైద్యుడిని అడగండి.
- కఫ్‌ని ఉబ్బించిన తర్వాత, స్టెతస్కోప్‌ని మీ మోచేయి మడత లోపలికి ఉండేలా, మీ చేయి లోపలి భాగంలో, మీ చేయి ప్రధాన ధమని ఉండే చోట ఉంచండి.
- స్టెతస్కోప్ ఉపయోగించే ముందు, అది సరైన విధంగా వినిపిస్తోందని నిర్ధారించుకోండి. స్టెతస్కోప్‌ని తట్టడం ద్వారా, అది సరైన విధంగా వినిపిస్తోందని నిర్ధారించవచ్చు.
- అధిక-నాణ్యత కలిగిన స్టెతస్కోప్ ప్రయోజనకరంగా ఉంటుంది.
- రక్త ప్రవాహ సమయంలో వినిపించే ప్రారంభ "హుష్" ధ్వనిని స్టెతస్కోప్‌తో వింటూ, బెలూన్‌లోని గాలిని నెమ్మదిగా తగ్గించండి. హుష్ వినిపించిన సమయంలో కనిపించే నంబర్ రాసుకోండి లేదా గుర్తుంచుకోండి. ఈ నంబర్‌ని మీ సిస్టోలిక్ రక్తపోటు అంటారు. దీన్నే పై రీడింగ్ అంటారు.
- రక్త ప్రవాహం ధ్వని మీకు వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని వింటూ, బెలూన్‌లోని గాలిని తగ్గిస్తూ, ఆ లయ ఆగే వరకు ఆవిధంగా చేయండి.
- లయ ఆగినప్పుడు కనిపించే రీడింగ్ గుర్తుంచుకోండి. ఈ నంబర్‌ని మీ డయాస్టోలిక్ రక్తపోటు అంటారు, దీన్నే క్రింది రీడింగ్ అంటారు.