Humrahi

గుండె వైఫల్యం నిర్వహణలో సాంకేతికత ఏవిధంగా సహాయపడగలదు? ధరించగలిగిన ఉపకరణాలు మరియు సుదూరం నుండి పర్యవేక్షణ పాత్ర

గుండె వైఫల్యం నుండి రక్షించుకునే పోరాటంలో సాంకేతికత అనేది శక్తివంతమైన మిత్రుడిగా మారడం ద్వారా, ఈ దీర్ఘకాలిక పరిస్థితి నిర్వహణలో మరియు రోగుల జీవన నాణ్యత మెరుగుపరచడంలో వినూత్న మార్గాలు అందిస్తోంది.

ధరించగలిగిన ఉపరణాలు మరియు సుదూరం నుండి పర్యవేక్షణ వ్యవస్థల ఏకీకరణతో ఆరోగ్య సంరక్షణలో వచ్చిన విప్లవాత్మక మార్పులనేవి ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం నిజ-సమయ డేటాను మరియు రోగుల కోసం వ్యక్తిగతీకరించిన సంరక్షణ అందిస్తున్నాయి.

ధరించగలిగిన ఉపకరణాలు: డేటాతో రోగులకు సాధికారత అందించడం

  • స్మార్ట్‌వాచీలు మరియు ఫిట్‌నెస్ ట్రాకర్లు లాంటి ధరించగలిగిన ఉపకరణాలనేవి ఇప్పుడు అడుగులు లెక్కించడం మరియు హృదయ స్పందన రేటు పర్యవేక్షించడం కంటే మించి పనిచేస్తున్నాయి.
  • హృదయ స్పందన రేటు, రక్తపోటు, ఆక్సిజన్ సంతృప్తత మరియు కర్ణిక దడ లాంటి క్రమరహిత గుండె లయలు గుర్తించడం లాంటి విభిన్న ఆరోగ్య సంబంధిత ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా, గుండె వైఫల్య నిర్వహణలో అవి ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
  • రోగులు వారి ఆరోగ్యం గురించి మరింత అప్రమత్తంగా ఉండేలా వారికి సాధికారత అందిండం ద్వారా, వాళ్లు తమ సంభావ్య సమస్యలు ముందుగానే గుర్తించి, తక్షణం వైద్య సంరక్షణ పొందేందుకు నిజ-సమయ డేటా స్ట్రీమ్‌లు ఉపకరిస్తున్నాయి.

రిమోట్ మానిటరింగ్ : ఆరోగ్య సంరక్షణలోని అగాధం పూడ్చడం

  • గుండె వైఫల్యం సమస్య కలిగిన రోగులు క్రమం తప్పకుండా వైద్యశాలకు వచ్చే అవసరం లేకుండానే, ఆరోగ్య సంరక్షణ నిపుణులు సుదూరం నుండే వారి పరిస్థితిని గమనించేందుకు రిమోట్ మానిటరింగ్ వ్యవస్థలు అవకాశం కల్పిస్తాయి.
  • ధరించగలిగే ఉపకరణాల నుండి డేటాను ఈ వ్యవస్థలు సేకరించి, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు ప్రసారం చేస్తాయి. తద్వారా, రోగుల పురోగతిని ట్రాక్ చేయడానికి, చికిత్స ప్రణాళికలను సర్దుబాటు చేయడానికి మరియు అవసరమైనప్పుడు ముందస్తు జోక్యం చేసుకోవడానికి వాళ్లకి వీలు కల్పిస్తాయి.
  • ఈవిధంగా, రిమోట్ మానిటరింగ్ అనేది ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తగ్గిస్తుంది, రోగి సమ్మతిని మెరుగుపరుస్తుంది మరియు సకాలంలో వైద్య జోక్యాలను సులభతరం చేస్తుంది.

సూచనలు:

  1. Chaudhry, S. I., Mattera, J. A., Curtis, J. P., Spertus, J. A., Herrin, J., Lin, Z., … & Krumholz, H. M. (2010). Telemonitoring in patients with heart failure. New England Journal of Medicine, 363(24), 2301-2309.
  2. Marzegalli, M., Lunati, M., Landolina, M., Perego, G. B., Ricci, R. P., Guenzati, G., … & Curnis, A. (2013). Remote monitoring of CRT-ICD: The multicenter Italian CareLink evaluation–ease of use, acceptance, and organizational implications. Pacing and Clinical Electrophysiology, 36(1), 60-68.

ఇటీవలి పోస్ట్‌లు