డైస్లిపిడెమియా మీద నియంత్రణ లేకపోతే, అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. డైస్లిపిడెమియా గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:
ప్రశ్న 1: డైస్లిపిడెమియా అంటే ఏమిటి?
సమాధానం: రక్తంలో లిపిడ్లు (కొవ్వులు), ప్రత్యేకించి కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్లు అసాధారణ స్థాయిల్లో ఉండడం.
ప్రశ్న 2: డిస్లిపిడెమియా రావడానికి కారణమయ్యే అంశాలేవి?
సమాధానం: నిశ్చల జీవనశైలి, సరికాని ఆహారం, ఊబకాయం, ధూమపానం, అధిక మద్యపానం మరియు కొన్ని ఔషధాలు
ప్రశ్న 3: డిస్లిపిడెమియాని ఎలా గుర్తిస్తారు?
సమాధానం: లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష ద్వారా రక్తంలోని మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్,(LDL) హెచ్‌డిఎల్(HDL) మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు కొలుస్తారు.
ప్రశ్న 4: ఔషధాల అవసరం లేకుండానే డిస్లిపిడెమియాని నిర్వహించవచ్చా?
సమాధానం: జీవనశైలి మార్పులతో (ఆహారంలో మార్పులతో) ఔషధాల అవసరం లేకుండానే డైస్లిపిడెమియాను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
ప్రశ్న 5: డిస్లిపిడెమియా కోసం ఎలాంటి చికిత్సా ఎంపికలు ఉన్నాయి?
సమాధానం: ఎల్‌డిఎల్(LDL) కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే స్టాటిన్స్, మరియు ఫైబ్రేట్లు లేదా ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్లు లాంటివి ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గిస్తాయి.
ప్రశ్న 6: డిస్లిపిడెమియా పరిస్థితిని రివర్స్ చేయవచ్చా?
సమాధానం: పూర్తిగా రివర్స్ చేసే పరిస్థితి లేనప్పటికీ, జీవనశైలి మార్పులు మరియు తగిన ఔషధాల ద్వారా దీనిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
ప్రశ్న 7: డిస్లిపిడెమియాతో వచ్చే సమస్యలు ఏవి?
సమాధానం: డైస్లిపిడెమియా పరిస్థితికి చికిత్స చేయకపోతే అథెరోస్క్లెరోసిస్, కరోనరీ హార్ట్ డిసీజ్, గుండెపోటు, పక్షవాతం మరియు పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి లాంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ప్రశ్న 8: డిస్లిపిడెమియా పరిస్థితిని నిరోధించవచ్చా?
సమాధానం: జన్యుపరమైన అంశాలను సవరించే అవకాశం లేనప్పటికీ, ఆరోగ్యకర జీవనశైలితో ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
ప్రస్తావన:
1.Pappan N, Rehman A. Dyslipidemia. [Updated 2022 Jul 11]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2023 Jan-. Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK560891/
- Ferraro, R.A., Leucker, T., Martin, S.S. et al.Contemporary Management of Dyslipidemia. Drugs82, 559–576 (2022).